News April 13, 2025

జలియన్ వాలాబాగ్.. స్వాతంత్ర్య పోరాటంలో మలుపు: మోదీ

image

జలియన్ వాలాబాగ్ అమరవీరులకు PM మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటమే మలుపు తిరిగిందని ట్వీట్ చేశారు. అమరవీరుల అజేయ స్ఫూర్తిని రాబోయే తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1919 APR 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న వారిపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది గాయపడ్డారు.

Similar News

News October 16, 2025

డెక్కన్ సిమెంటు వివాదంతో నాకు సంబంధం లేదు: ఉత్తమ్

image

TG: డెక్కన్ సిమెంటు కంపెనీ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ వివాదంపై తాను మాట్లాడేది లేదన్నారు. ‘నా ప్రమేయం లేదని కొండా సురేఖ కుమార్తె కూడా చెప్పారు కదా?’ అని ముక్తసరిగా స్పందించారు. కొన్నిరోజులుగా మంత్రి కొండా సురేఖకు ఇతర మంత్రులకు మధ్య వివాదం రేగడం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం కూడా దృష్టి సారించింది. పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగారు.

News October 16, 2025

పాత రిజర్వేషన్లతో ‘స్థానిక’ ఎన్నికలు!

image

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

News October 16, 2025

మొబైల్‌తో వెళ్తే అలాగే కూర్చుండిపోతారు!

image

మెరుగైన పేగు ఆరోగ్యం కోసం బాత్రూమ్‌లో ఫోన్ వాడటం ఆపేయాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చుంటే మలసిరలపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ‘ముఖ్యంగా బాత్రూమ్‌లో ఫోన్ వాడకండి. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. వెస్ట్రన్ కమోడ్ ఉపయోగిస్తే చిన్న స్టూల్‌పై కాళ్లు ఉంచండి. హ్యాండ్ వాష్ చేసుకోండి ’ అని తెలిపారు.