News September 18, 2024
‘హిరోషిమా’పై జేమ్స్ కామెరూన్ మూవీ?

వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Similar News
News November 7, 2025
గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్

గుంటూరులో గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్న మైనర్‌తో సహా ఏడుగురు యువకులను నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ₹30 వేల నగదు, 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీ వద్ద ఖాళీ స్థలంలో గంజాయి కలిగి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ అరెస్టులు చేసినట్లు డీఎస్పీ అరవింద్ తెలిపారు.
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.


