News January 8, 2025
జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్

జమిలి ఎన్నికలపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో జమిలి ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పినట్లు సమాచారం. ఆర్థిక సాధ్యాసాధ్యాలు, అవసరమైన ఈవీఎంలపై ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య హక్కుల్ని జమిలి ఎన్నికలు ఉల్లంఘిస్తాయని ప్రియాంక పేర్కొన్నట్లు కమిటీ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 19, 2025
పొంగులేటి బయోపిక్.. హీరోగా సుమన్

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్.. పొంగులేటి పాత్రను పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. బయ్యా వెంకట నర్సింహ రాజ్ దీనికి డైరెక్టర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యాం పాటలు రాస్తున్నారు.
News September 19, 2025
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్గానూ పనిచేశారు.
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ – లక్షణాలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి చెట్ల లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. పూత, పిందె, కాయ, పండ్లపై గోధుమ రంగులో ఉంగరాల్లాంటి రింగుల మచ్చలు ఏర్పడతాయి. ఆ రింగు మధ్య బాగం ఆకుపచ్చగా ఉంటుంది. తెగులు సోకిన పూలు.. పిందెగా మారవు. పిందెలు ఎదగవు. కాయలు తొందరగా పండిపోయి మెత్తగా మారి నీరు కారినట్లు అవుతాయి. ఈ మచ్చల వల్ల పండ్లు నాణ్యత కోల్పోయి మార్కెట్లో పంటకు సరైన ధర దక్కదు.