News September 19, 2024
జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?

జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటులో 2/3 వంతు సభ్యుల ఆమోదం అవసరం. NDAకి ప్రస్తుతం ఉన్న మద్దతు ఏ మాత్రం సరిపోదు. అదనంగా సభ్యుల మద్దతు కూడగడితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్సభలో NDAకు 293 మంది సభ్యుల బలం ఉంటే, సవరణల ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. ఇక రాజ్యసభలో 121 మంది బలం ఉంటే, అదనంగా 43 మంది సభ్యుల బలం అవసరం ఉంది.
Similar News
News November 23, 2025
భూమిలో కర్బన నిల్వల స్థాయి టెస్టింగ్ ఇలా..

ఒక చెంచాతో 1 గ్రాము మట్టిని, 2ml పొటాషియం డైక్రోమేట్తో పాటు 2ml సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఒక సీసాలో పోసి బాగా కలపాలి. 20 నిమిషాల తర్వాత ఆ సీసాలో నీటిని పోయాలి. ఆ ద్రావణం మారిన రంగును బట్టి భూమిలో కర్బన శాతం తెలుసుకోవచ్చు. ☛ నారింజ/పసుపు రంగు – కర్బన స్థాయి తక్కువ ☛ ముదురు గోధుమ/ నలుపు రంగు – కర్బన స్థాయి మధ్యస్థం ☛ ఆకు పచ్చ/ నీలి రంగు – కర్బన స్థాయి ఎక్కువ.
News November 23, 2025
2 రోజుల్లోనే ముగిసిన టెస్టు.. రూ.17.35 కోట్ల నష్టం!

యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టు కేవలం 2 రోజుల్లో ముగియడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగో రోజులకు అమ్మకానికి ఉంచిన టికెట్ ఆదాయం కోల్పోవడంతో దాదాపు రూ.17.35 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. మూడో రోజు టికెట్లు దాదాపు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొదటి రెండు రోజుల్లోనే లక్షకుపైగా అభిమానులు హాజరైనా, తర్వాతి రోజుల ఆదాయం కోల్పోవడం గట్టిదెబ్బే.
News November 23, 2025
ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారు కానీ ఆధారాలు లేవు: ప్రశాంత్ కిషోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంపై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే అనుమానం ఉందని, కానీ దానికి ఆధారాలు లేవని తెలిపారు. గ్రౌండ్ ఫీడ్బ్యాక్కు భిన్నంగా ఫలితాలు ఉన్నాయని, ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోందని అన్నారు. కాగా 243 స్థానాలున్న బిహార్లో 238 చోట్ల పోటీ చేసినా JSP ఒక్క సీటు కూడా గెలవలేదు. ఓటు శాతం 2-3%కే పరిమితమైంది.


