News December 24, 2024
జనవరి 8న ‘జమిలి జేపీసీ’ భేటీ

జమిలి ఎన్నికలపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలిసారిగా Jan 8న భేటీ కానుంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయ బిల్లును కేంద్రం గత వారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జేపీసీ తొలి సమావేశంలో అధికారులు ఈ రెండు బిల్లులపై సభ్యులకు వివరించనున్నారు. JPCలో 39 మంది సభ్యులున్నారు.
Similar News
News November 18, 2025
మారేడుమిల్లిలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

AP: టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.