News October 12, 2024

జమ్మి ఆకులే ‘బంగారం’!

image

తెలంగాణలో జమ్మి చెట్టు ఆకులను బంగారంలా భావిస్తారు. దసరా రోజు సాయంత్రం జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఆకులను ఆత్మీయులకు పంచుతారు. కొందరు పూజగదిలో భద్రపరుస్తారు. కుబేరుడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలో బంగారాన్ని కురిపించాడని, అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారని పురాణాలు చెబుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలుంటాయి. దీని గాలి పీల్చితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Similar News

News October 12, 2024

ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం

image

TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.

News October 12, 2024

ఆ విషయంలో భాగ‌స్వామి వద్దకు కాకపోతే ఇంకెవరి వద్దకు వెళ్తారు: హైకోర్టు

image

నైతిక నాగ‌రిక‌ స‌మాజ‌ంలో ఒక వ్య‌క్తి (M/F) శారీరక, లైంగిక కోరిక‌ల‌ను తీర్చుకోవ‌డానికి భాగ‌స్వామి వ‌ద్ద‌కు కాకుండా ఇంకెవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్తార‌ని అల‌హాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భ‌ర్త‌పై పెట్టిన‌ వ‌ర‌క‌ట్నం కేసులో భార్య ఆరోప‌ణ‌ల‌కు త‌గిన‌ ఆధారాలు లేవ‌ని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మ‌ధ్య‌ లైంగిక సంబంధ అంశాల్లో అస‌మ్మ‌తి చుట్టూ కేంద్రీకృత‌మైనట్టు పేర్కొంది.

News October 12, 2024

చంద్రబాబును కలిసి చెక్కులను అందించిన చిరంజీవి

image

మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి రూ.కోటి విరాళం అందజేశారు. తన తరఫున రూ.50 లక్షలు, కుమారుడు రాంచరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను ముఖ్యమంత్రికి ఇచ్చారు. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఈ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.