News March 25, 2025
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే: భారత ప్రతినిధి

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్‌కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. UNOలో పాక్ అనవసరంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకొస్తోందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్‌కే చెందుతుందని అన్నారు. UNO శాంతి పరిరక్షణ చర్చలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రతినిధి లేవనెత్తగా భారత్ దీటుగా బదులిచ్చింది.
Similar News
News March 28, 2025
మా శ్రమతోనే BYD రాష్ట్రానికి వచ్చింది: కేటీఆర్

TG: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్విటర్లో తెలిపారు. ‘BYD రాష్ట్రంలో 10బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022-23లో ఒప్పందం చేసుకున్నాం. కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.
News March 28, 2025
RCB గెలుపు దాహం తీర్చుకుంటుందా?

IPLలో భాగంగా ఇవాళ చెపాక్ స్టేడియంలో RCBvsCSK మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఊపును ఇవాళ కూడా కొనసాగించాలని CSK భావిస్తోంది. పైగా ఈ స్టేడియంలో బెంగళూరుపై చెన్నైదే పైచేయి. ఇక్కడ చివరగా 17 ఏళ్ల క్రితం 2008లో CSKపై RCB గెలిచింది. ఆ తర్వాత ఏడు మ్యాచులు ఆడితే ఒక్కటీ గెలవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి సత్తా చూపెట్టాలని RCB వ్యూహాలు రచిస్తోంది.
News March 28, 2025
వచ్చే నెలలో థాయ్‌లాండ్, శ్రీలంకలో పీఎం పర్యటన

వచ్చే నెల 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బ్యాంకాక్‌లో జరిగే 6వ BIMSTEC సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొంది. 2018లో నేపాల్‌లో జరిగిన సదస్సు అనంతరం BIMSTEC నేతలు సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంక పర్యటనలో ఆయన పలు ఒప్పందాల్ని చేసుకునే అవకాశం ఉంది.