News January 30, 2025

JAN 31న పాఠశాలలకు సెలవు :ASF కలెక్టర్

image

నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 31వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జాతరకు పిల్లలు వెళ్లాలని ఆయన కోరారు.ఇందుకు బదులుగా మార్చి 8వ తేదీ 2వ శనివారం రోజు పాఠశాలలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

కర్నూలు స్మార్ట్ సిటీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి: కలెక్టర్

image

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించి, నిరంతర తాగునీరు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్, రవాణా వ్యవస్థ, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.

News December 6, 2025

ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

News December 6, 2025

కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

image

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.