News January 30, 2025
JAN 31న పాఠశాలలకు సెలవు :ASF కలెక్టర్

నాగోబా జాతర సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 31వ తేదీన సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ జాతరకు పిల్లలు వెళ్లాలని ఆయన కోరారు.ఇందుకు బదులుగా మార్చి 8వ తేదీ 2వ శనివారం రోజు పాఠశాలలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
NGKL: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో గోల్డ్‌మెడల్

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న 11వ తెలంగాణ స్టేట్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గోరిట గ్రామానికి చెందిన పి.అభిషేక్ అండర్-20 ట్రిపుల్ జంప్ విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. అతని విజయాన్ని అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ స్వాములు, అసోసియేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News February 18, 2025
ఇన్ఫీ మా ట్రేడ్ సీక్రెట్లను దొంగిలించింది: కాగ్నిజెంట్

తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ TriZetto ట్రేడ్ సీక్రెట్లను దొంగిలిస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్టు కాగ్నిజెంట్ US కోర్టు ఫైలింగులో పేర్కొంది. తమ కంపెనీ, తమ CEO రవికుమార్ పోటీ విరుద్ధ చర్యలకు పాల్పడ్డారని, తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ Infosys Helix గ్రోత్‌ను తగ్గించేలా సమాచారాన్ని దుర్వినియోగం చేశారన్న ఇన్ఫీ కౌంటరుకు ఇలా స్పందించింది. ఈ 2 కంపెనీల మధ్య చాన్నాళ్లుగా పోచింగ్ కేస్ నడుస్తోంది.
News February 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పెరిగి రూ.79,700లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.330 పెరగడంతో రూ.86,950లకు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000గా ఉంది. వివాహ శుభకార్యాల వేళ రోజూ ధరలు పెరగడంతో పెళ్లిళ్లు చేసేవారు ఆందోళన పడుతున్నారు.