News January 29, 2025

JAN 31న నిర్మల్‌లో జాబ్ మేళా

image

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన ఇన్‌ఛార్జ్ అధికారి గోవింద్ తెలిపారు. పేటీఎం కంపెనీలో 50 సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. 31న నిర్మల్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. 9390227923, 9441535253 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Similar News

News September 18, 2025

జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

image

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.

News September 18, 2025

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంత్రి సుభాష్ భేటీ

image

వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఆయన ఛాంబర్‌లో గురువారం కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. పంచాయితీరాజ్ శాఖతో కార్మికశాఖకు ముడిపడి ఉన్న అంశాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మంత్రి ప్రస్తావించారు. వీటిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

News September 18, 2025

విశాఖలో 524 ఆక్రమణల తొలగింపు

image

విశాఖలో ఆపరేషన్ లంగ్స్‌లో భాగంగా 524 ఆక్రమణల తొలగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ చేపట్టినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు గురువారం తెలిపారు. జోన్ 1లో 20 ఆక్రమణలు, జోన్-2 90, జోన్ -3లో 42, జోన్ -4 60, జోన్ -5లో 52, జోన్-6లో 86, జోన్ – 7లో 42, జోన్-8లో 67 ఆక్రమణలు తొలగించారు.