News March 14, 2025

ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ

image

AP: ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేస్తారు.

Similar News

News November 28, 2025

సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

image

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్‌ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.

News November 28, 2025

నాన్-ఏసీ కోచ్‌ల్లోనూ దుప్పటి, దిండు

image

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్‌లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

News November 28, 2025

హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్‌లో బెస్ట్!

image

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT