News April 11, 2025
కవితపై జనసేన నేత పృథ్వీ ఫైర్

పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, దురదృష్టవశాత్తు <<16050257>>ఆంధ్రప్రదేశ్<<>> Dy.CM అయ్యారన్న MLC కవిత వ్యాఖ్యలపై జనసైనికులు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియాలో కౌంటర్ అటాక్ మెుదలుపెట్టారు. ‘పొలిటికల్ సీరియస్ గురించి మేడం మాట్లాడటం బాగుంది. ఇచ్చిన శాఖకు 200% న్యాయం చేసిన ఆయనెక్కడ, పదవి అడ్డుపెట్టుకుని మద్యం కుంభకోణం చేసిన మీరెక్కడ’ అంటూ జనసేన నేత పృథ్వీ ట్వీట్ చేశారు.
Similar News
News April 13, 2026
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News April 13, 2026
ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు
News April 13, 2026
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.380 తగ్గి రూ.1,52,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పతనమై రూ.1,39,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.


