News February 12, 2025

23న జనసేన శాసనసభా పక్ష భేటీ

image

AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Similar News

News December 7, 2025

ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

image

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్‌, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్‌లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News December 7, 2025

37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

image

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్‌లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.

News December 7, 2025

నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతోందా?

image

కొంతమందికి నిద్రలో నోటి నుంచి లాలాజలం కారుతుంటుంది. అయితే ఇది సాధారణం కాదంటున్నారు వైద్యులు. నిద్రలో నోటి నుంచి లాలాజలం కారడం కొన్ని వ్యాధులకు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నారు. సైనస్ ఇన్‌ఫెక్షన్, నిద్ర, నాడీ, గ్యాస్ట్రో సంబంధిత, దంతాలు లేదా చిగుళ్లలో సమస్యలకు సంకేతమని పేర్కొంటున్నారు. ఈ సమస్య రోజురోజుకీ తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.