News February 23, 2025
ఇవాళ జనసేన శాసనసభాపక్ష సమావేశం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఇవాళ జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ జరగనుంది. బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి? బడ్జెట్‌పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
Similar News
News November 15, 2025
పార్టీ పరంగా 50% రిజర్వేషన్లకు ఖర్గే గ్రీన్ సిగ్నల్?

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా BCలకు 50% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, PCC చీఫ్ మహేశ్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు ఎల్లుండి జరిగే క్యాబినెట్లో రిజర్వేషన్లపై చర్చించనున్నారు.
News November 15, 2025
ఢిల్లీ పేలుళ్ల ఘటన… అల్ ఫలాహ్ వర్సిటీపై కేసులు

ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో ఢిల్లీ పోలీసులు హరియాణా అల్ ఫలాహ్ వర్సిటీపై 2 కేసులు నమోదు చేశారు. UGC, NAACలు వర్సిటీ అక్రమాలను గుర్తించిన తదుపరి మోసం, ఫోర్జరీ, తప్పుడు అక్రిడిటేషన్లపై కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా పేలుళ్లకు నేరపూరిత కుట్రకు సంబంధించి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ వర్సిటీపై ఇంతకు ముందు ఒక కేసును నమోదు చేశారు. పేలుళ్ల నిందితుల వివరాలు సేకరించి విచారిస్తున్నారు.
News November 15, 2025
డాక్టర్ డ్రెస్‌లో ఉగ్రవాది

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడు, జైషే మహమ్మద్ ఉగ్రవాది ఉమర్ డాక్టర్ డ్రెస్‌లో ఉన్న ఫొటో బయటకు వచ్చింది. మెడలో స్టెతస్కోప్ వేసుకుని కనిపించాడు. కాగా ఈనెల 10న జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. NIA, ఇతర భద్రతా సంస్థలు ఉమర్ నెట్వర్క్ గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఉమర్ ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో వైద్యుడిగా పని చేసేవాడు.


