News August 28, 2025
నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు

AP: ఇవాళ్టి నుంచి విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ‘సేనతో సేనాని’ ప్రారంభంకానుంది. మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ పార్టీ ఎంపీలు, MLAలు, MLCలతో పవన్ భేటీ అవుతారు. రేపు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చే క్రియాశీలక కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేక భేటీ ఉంటుంది. 30వ తేదీన అల్లూరి సీతారామరాజు ప్రాంగణం(ఇందిరా గాంధీ స్టేడియం) నుంచి పవన్ ప్రసంగిస్తారు.
Similar News
News August 28, 2025
సెలవుపై ముందే నిర్ణయం తీసుకోవచ్చుగా.. నెటిజన్ల సూచన

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పదికి పైగా జిల్లాలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొన్ని జిల్లాల్లో లేటుగా తీసుకున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల స్కూళ్లకు పిల్లలు, టీచర్లు చేరుకున్నాక సెలవు ప్రకటించడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుని ముందు రోజే సెలవుపై నిర్ణయం తీసుకోవడం అంత కష్టమా అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News August 28, 2025
రేవంత్ గెటప్‌లోని వినాయక విగ్రహం తొలగింపు

TG: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం హబీబ్‌నగర్‌లో CM రేవంత్ గెటప్‌లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో సౌత్ వెస్ట్ DCP మండపాన్ని సందర్శించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దంటూ నిర్వాహకుడు సాయికుమార్‌ను హెచ్చరించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఆ విగ్రహాన్ని తొలగించి మరొకటి ఏర్పాటు చేశారు. అంతకుముందు దీనిపై MLA రాజాసింగ్ పోలీసులకు <<17538582>>ఫిర్యాదు<<>> చేశారు.
News August 28, 2025
నాలుగు జిల్లాలకు RED ALERT

TG: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 20 గంటల పాటు అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని వెల్లడించింది. కాగా నిన్న కురిసిన వర్షాలకు నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.