News August 21, 2025
టీమ్ ఇండియా మేనేజర్‌గా జనసేన MLA కుమారుడు

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఆంధ్రాకు చెందిన పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా టీమ్ ప్లేయర్‌గా రాణించారు. కాగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు కూడా. ఈ నెల 9 నుంచి 28 వరకు ఆయన టీమ్ ఇండియాతో పర్యటించనున్నారు.
Similar News
News August 21, 2025
‘ఇంటర్వెల్ వాకింగ్’ చేస్తున్నారా?

‘ఇంటర్వెల్ వాకింగ్’తో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ జపాన్ పద్ధతిలో 3 నిమిషాలు వేగంగా, మూడు నిమిషాలు నెమ్మదిగా నడుస్తారు. కనీసం వారానికి నాలుగు రోజుల పాటు 30 నిమిషాల చొప్పున నడిస్తే మేలని అంటున్నారు. ఈ వాకింగ్‌తో బీపీతో పాటు కీళ్ల నొప్పులు తగ్గాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ వాకింగ్‌తో గాలిని క్రమ పద్ధతిలో పీల్చుకుంటారు.
News August 21, 2025
భారీగా తగ్గనున్న పాలసీల ధరలు!

ఆరోగ్య, వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. ఈ పాలసీలను GST నుంచి మినహాయించాలని మోదీ సర్కారు ప్రతిపాదించినట్లు బీమాపై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. అన్ని రాష్ట్రాలు దీనికి సుముఖత వ్యక్తం చేసినట్లు, త్వరలోనే GST కౌన్సిల్‌కు ఈ అంశంపై నివేదిక ఇస్తామన్నారు. ఇది అమలైతే కేంద్రానికి పన్ను రాబడి రూ.9,700కోట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పాలసీలపై 18% GST ఉంది.
News August 21, 2025
ఉద్ధృతంగా గోదావరి.. ఉ.11గంటలలోపు మొదటి ప్రమాద హెచ్చరిక!

గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం ఉండగా, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా ఉందని APSDMA వెల్లడించింది. ఉదయం 11గంటల లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఆస్కారముందని తెలిపింది. అటు, ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు చెప్పింది.