News March 17, 2024

జనగామ: రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

image

రైలుపై నుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన జనగామ సమీపంలోని యశ్వంతాపూర్ వాగు వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల ప్రకారం.. ఘన్పూర్ మండలం కర్కపల్లికి చెందిన అంబాల వంశీ (21) సికింద్రాబాద్ నుంచి ఖాజీపేట వైపునకు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా జారి కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తుపట్టనంతగా నుజ్జునుజ్జు అయ్యింది.  

Similar News

News February 24, 2026

వరంగల్ జిల్లాలో పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించబోయే ఇంటర్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ పరీక్షా ఏర్పాట్ల వివరాలను తెలిపారు.

News February 21, 2026

తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రానున్న వేసవిలో జిల్లాలోని 698 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,16,934 కుటుంబాలకు, నల్లా కనెక్షన్లు లేని 1,784 గృహాలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ అధికారులతో తాగునీటి వేసవి ప్రణాళికపై సమీక్షించారు.

News February 21, 2026

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

image

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.