News August 18, 2024

జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ పేరు పెట్టాలి: శ్రీనివాస్ గౌడ్

image

TG: జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ పాపన్న జయంతి సందర్భంగా ప్రభుత్వం జిల్లాకు ఆయన పేరు ప్రకటించాలని కోరారు. ట్యాంక్‌బండ్‌పై బహుజన పోరాటయోధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం గతంలో తమ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు.

Similar News

News February 12, 2026

VIRAL: ₹300తో కొని ₹634కోట్లకు అమ్మాడు!

image

మలేషియాకు చెందిన కింగ్ అర్స్యాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం ₹300తో ‘ai.com’ అనే డొమైన్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏఐకి పెరిగిన క్రేజ్ వల్ల ఈ డొమైన్‌ను ఇస్మాయిల్ ఒక క్రిప్టో సంస్థకు ఏకంగా ₹634 కోట్లకు విక్రయించారు. కామ్‌ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఈ డొమైన్‌ను దక్కించుకున్నారు. గతంలో దీనిని ‘OpenAI’ కూడా వాడుకుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభం పొందిన అరుదైన డీల్‌గా ఇది నిలవడం విశేషం.

News February 12, 2026

పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ

image

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పేషీలో కలిశారు. నియోజకవర్గ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

News February 12, 2026

రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

image

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.