News January 10, 2025

సంక్రాంతికి ‘జనసాధారణ్’ ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ‘జనసాధారణ్’ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. ఇవి చర్లపల్లి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఆరు ప్రత్యేక రైళ్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్ల పూర్తి వివరాలను పై ఫొటోలో చూడొచ్చు. ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీల మోత ఉండటంతో చాలా మంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

Similar News

News January 10, 2025

కంగ్రాట్స్ డియర్ హస్బెండ్: ఉపాసన

image

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన నేపథ్యంలో సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందంటూ పలు వెబ్‌సైట్స్ రాసిన రివ్యూలను షేర్ చేశారు. ‘కంగ్రాట్స్ డియర్ హస్బెండ్. ప్రతి విషయంలోనూ నువ్వు నిజమైన గేమ్ ఛేంజర్. లవ్ యూ’ అని రాసుకొచ్చారు.

News January 10, 2025

తెలుగు యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు

image

AP: తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. కాగా భార్గవ్ ‘ఫన్ బకెట్’ పేరుతో వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

News January 10, 2025

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేత

image

కెనడా PM పదవికి పోటీలో నిలుస్తున్నట్లు భారత సంతతి, లిబరల్ పార్టీ MP చంద్రా ఆర్యన్ ప్రకటించారు. దేశాన్ని మరింత సుస్థిర ప్రగతివైపు నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్యన్ స్వస్థలం కర్ణాటక కాగా కెనడాలో స్థిరపడ్డారు. ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఆయన, భారత్-కెనడా బంధం బలోపేతానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ప్రధాని ట్రూడో పదవి నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.