News June 13, 2024
పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దు: పవన్

AP: ఈనెల 20 తర్వాత జనసేనాని, మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని చెప్పారు. తనను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్, ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 27, 2025
పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వర్ష సూచనల దృష్ట్యా పంటల కొనుగోళ్లపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై జాగ్రత్తగా వ్యవహరించాలని.. రైతులకు నష్టం జరగకుండా, ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.
News October 27, 2025
అనంతపురం యువకుడికి రూ.2.25 కోట్ల జీతంతో గూగుల్లో ఉద్యోగం

AP: అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి గూగుల్లో ఉద్యోగం సంపాదించారు. న్యూయార్క్లోని Stony Brook Universityలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కాలిఫోర్నియాలోని గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించారని అతడి తండ్రి కొనదుల రమేశ్ రెడ్డి తెలిపారు. ఏడాదికి రూ.2.25 కోట్ల జీతం అందుకోనున్నట్లు వెల్లడించారు. కాగా అనంతపురం మూలాలు ఉన్న సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ CEOగా ఉన్న సంగతి తెలిసిందే.
News October 27, 2025
ఉపవాసాల వెనుక ఉద్దేశ్యం ఇదే..

ధార్మిక ఆచరణలు ప్రారంభించే ముందు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేసుకోవాలి. అందులో భాగంగానే ఉపవాసం ఉంటారు. భౌతిక సుఖాలను తాత్కాలికంగా త్యజించడం దీని పరమార్థం. అయితే ఉపవాసమంటే ఆహారం పూర్తిగా మానడం కాదు. ఇది దయ, ఓర్పు, శాంతి వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తుంది. కోరికలు, లోభం వంటి చెడు గుణాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక గుణాలు లేకుండా, ఉపవాసం పాటిస్తూ కడుపు మాడ్చుకుంటే ఎలాంటి ఫలితం లభించదు. <<-se>>#Aushadam<<>>


