News March 17, 2024
ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా జంగా
కాంగ్రెస్ కోసం పని చేసినా అవకాశాలు దక్కని నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తోంది. జనగామ మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ & గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News December 4, 2024
ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం?
ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఆగస్టు 31న ఇదే ప్రాంతంలోని మేడారం అడవుల్లో లక్షల సంఖ్యలో భారీ చెట్లు నేలకొరిగాయి. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే భారీ వృక్షాలు టోర్నడో తరహాలో విరిగి పడగా, వాటిపై ఇంకా అటవీశాఖ అధికారుల పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు నమోదు కావడంపై తీవ్ర ఆందోళన కొనసాగుతోంది.
News December 4, 2024
ములుగు: భార్య జైలులో.. భర్త ఎన్‌కౌంటర్లో మృతి
ములుగు జిల్లా చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల్లో ఒకరైన ముసాకి దేవల్@ కరుణాకర్ ఐదేళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లాడని తండ్రి బుజ్జ తెలిపారు. భార్య రీత కూడా దళసభ్యురాలు కావడం గమనార్హం. కాగా, ఏడాదిక్రితం చర్ల వద్ద రీతను పోలీసులు అరెస్టు చేయగా ప్రస్తుతం ఖమ్మంలో జైలు జీవితాన్ని అనుభవిస్తోంది. చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి బుజ్జ మాటవినకుండా అడవిలోకి పోయి, ఎన్‌కౌంటర్ర్లో చనిపోయినట్లు తెలిపాడు.
News December 4, 2024
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీతక్క
ఈనెల 5న ప్రారంభం కానున్న ‘ఇందిరా మహిళా శక్తి బజార్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి మంత్రి సీతక్క ఆహ్వానం అందజేశారు. ఇందిరా మహిళా శక్తి బజార్ మహిళా శక్తి పథకంలో కీలక మలుపు అని, ఆర్థిక స్వావలంబన దిశగా శ్రీకారం అని మంత్రి సీతక్క చెప్పారు.