News April 25, 2024
ప్రభాస్-రాఘవపూడి సినిమాలో జాన్వీ?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి- హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్గా ఆమెను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర వర్గాలు స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో దేవరలో, రామ్‌చరణ్‌తో ఓ సినిమాలో జాన్వీ నటిస్తోన్న విషయం తెలిసిందే.
Similar News
News November 19, 2025
RRB గ్రూప్-D ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

<
News November 19, 2025
మావోల ఎన్కౌంటర్.. మృతుల్లో టెక్ శంకర్

AP: ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మరణించారని అల్లూరి జిల్లా SP బర్దర్ తెలిపారు. 3రోజులుగా నిర్వహిస్తున్న కూంబింగ్‌లో ఇవాళ తెల్లవారుజామున నక్సల్స్ ఎదురుపడటంతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. మృతుల్లో టెక్ శంకర్ ఉన్నారని, ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. AOBలో మళ్లీ రిక్రూట్మెంట్ జరుగుతోందని, దీన్ని షెల్టర్ జోన్‌గా చేసుకోవాలని మావోలు భావించారని తెలిపారు.
News November 19, 2025
కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.


