News June 2, 2024
‘SSMB 29’లో మహేశ్ సరసన జాన్వీ?
మహేశ్ బాబు హీరోగా ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రాజమౌళి జాన్వీ కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ సరసన జాన్వీనే కరెక్ట్ జోడీ అని ఆయన భావిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో మరో హీరోయిన్గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.
Similar News
News January 15, 2025
‘కల్కి-2’ రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్
‘కల్కి-2’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సీక్వెల్లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు.
News January 15, 2025
కృష్ణా జలాల్లో మెజారిటీ వాటా TGకే దక్కాలి: మంత్రి ఉత్తమ్
కృష్ణా జలాల విషయంలో TGకి అన్యాయం జరగొద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేపు కృష్ణానది జలవివాదంపై విచారణ ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలపై ఢిల్లీలో సమీక్షించారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. TGలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికే దక్కాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
News January 15, 2025
2025లో నెట్ఫ్లిక్స్లో వచ్చే సినిమాలు ఇవే
ఈ ఏడాది తమ OTTలో వచ్చే కొన్ని సినిమాల పేర్లను నెట్ఫ్లిక్స్ ప్రకటించింది.
☞ నాని ‘హిట్-3’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
☞ విజయ్ దేవరకొండ- డైరెక్టర్ గౌతమ్ మూవీ (VD 12)
☞ నాగచైతన్య ‘తండేల్’, సూర్య ‘రెట్రో’
☞ రవితేజ ‘మాస్ జాతర’
☞ మ్యాడ్ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’
☞ సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’
☞ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
☞ పవన్ కళ్యాణ్ ‘OG’