News April 10, 2024
జన్మభూమి కమిటీ సభ్యులే వాలంటీర్లు: సీఎం జగన్

AP: చంద్రబాబు సీఎం అయితే జన్మభూమి కమిటీ సభ్యుల్ని వాలంటీర్లుగా తీసుకొస్తారని సీఎం జగన్ అన్నారు. వాళ్లకు దోచిపెట్టేందుకే రూ.10వేలు జీతం ఇస్తాననే హామీ ఇచ్చాడని ఆరోపించారు. ‘వృద్ధులకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్ను చంద్రబాబు ఆపించారు. ఇప్పుడు గాలి ఎదురు తిరగడంతో మళ్లీ మోసపు హామీలిస్తున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసి మోసం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలి’ అని కోరారు.
Similar News
News December 3, 2025
మేడారం జాతరకు 70 కొత్త ట్రాన్స్ఫార్మర్లు: ఎన్పీడీసీఎల్ సీఎండి

మేడారం జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కోసం 70 కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి అన్నారు. మేడారంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నార్లాపూర్లోని 33/11కేవీ సబ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది అన్నారు. జంపన్నవాగు వద్ద ఆరు టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వనదేవతల గద్దెల వద్ద నిరంతర విద్యుత్ కోసం కవర్డ్ కండక్టర్ను ఏర్పాటు చేస్తామని అన్నారు.
News December 3, 2025
రైతుల ఖాతాల్లో రూ.7,887కోట్లు జమ: ఉత్తమ్

వరి సేకరణలో TG అగ్రస్థానంలో కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘ఇప్పటివరకు 41.6 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. 48hrsలో ₹7,887Cr చెల్లించాం. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. సన్న రకాలకు ₹314Cr బోనస్ చెల్లించాం. అటు APలో ఇప్పటివరకు 11.2L టన్నులు సేకరించారు. 1.7లక్షల మందికి రూ.2,830Cr చెల్లించారు. AP కంటే TG స్కేల్ 4 రెట్లు ఎక్కువ’ అని ట్వీట్ చేశారు.
News December 3, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

AP: రాబోయే 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని IMD అంచనా వేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.


