News November 20, 2024
జన్మత్ పోల్స్: రెండు రాష్ట్రాల్లో హంగ్

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ‘హంగ్’ పరిస్థితి రావొచ్చని జన్మత్ పోల్స్ అంచనా వేసింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 130-145, MVA 125-140 సీట్లు గెలవొచ్చని తెలిపింది. పార్టీల పరంగా బీజేపీ 77-82, SS 38-42, NCP 12-15, కాంగ్రెస్ 48-52, SSUBT 37-41, NCP(SP) 38-42, ఇతరులు 15-17 సీట్లు గెలుస్తాయంది. ఝార్ఖండ్‌లో ఎన్డీఏ 41-45, ఇండియా 36-39, ఇతరులు 3-4 సీట్లు గెలవొచ్చని పేర్కొంది.
Similar News
News December 4, 2025
SGB బొనాంజా.. గ్రాముకు రూ.9,859 లాభం

సావరిన్ గోల్డ్ బాండ్స్(SGB) మదుపర్లకు భారీ లాభాలను అందిస్తున్నాయి. 2017 డిసెంబర్ 4న విడుదల చేసిన సిరీస్-X బాండ్లకు అప్పట్లో గ్రాము ₹2,961గా RBI నిర్ణయించింది. తాజాగా ఆ బాండ్లు మెచ్యూరిటీకి వచ్చాయి. ప్రస్తుతం వాటి ధరను ₹12,820గా RBI నిర్ణయించింది. అంటే ఒక్కో గ్రాముపై ₹9,859 లాభం(333%) వచ్చింది. దీనికి ఏటా చెల్లించే 2.5% వడ్డీ అదనం. ఇటీవల సిరీస్-VI బాండ్లకు ₹9,121 లాభం వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.
News December 4, 2025
పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్‌ను భారత్‌కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.


