News January 13, 2025

జనవరి 13: చరిత్రలో ఈరోజు

image

1948: హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టారు
1879: లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ జననం
1919: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి జననం
1949: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం
1995: సినీ నటుడు వైష్ణవ్ తేజ్ జననం
2014: తెలుగు సినిమా నటి అంజలీదేవి మరణం

Similar News

News January 1, 2026

ఈ దశలో మామిడికి తప్పక నీరు అందించాలి

image

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని రకాల మామిడి చెట్లలో ఇప్పటికే పూమొగ్గలు కనిపిస్తున్నాయి. ఇలా పూమొగ్గలు ఏర్పడి, అవి పెరుగుదల దశలో ఉన్నప్పుడు తేలికపాటి నీటి తడి ఇవ్వాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పిందె ఏర్పడిన తర్వాత (బఠాణి గింజ సైజులో ఉన్నప్పుడు), ప్రతి 15-20 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలని చెబుతున్నారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యవసాయ నిపుణుల సూచనలు తీసుకోవాలి.

News January 1, 2026

న్యూ ఇయర్ రోజున ఈ పనులు వద్దు: పండితులు

image

కొత్త ఏడాది మొదటి రోజున మనం చేసే పనులు ఆ ఏడాదంతా మనపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఇంట్లో గొడవలు, వాదనలకు దూరంగా ఉండాలని, అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని అంటున్నారు. ‘నలుపు దుస్తులు వద్దు. ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ఎన్ని దీపాలు పెడితే అంత మంచిది. ఏడిచినా, విచారంగా ఉన్నా ఏడాదంతా అదే కొనసాగుతుంది’ అంటున్నారు.

News January 1, 2026

BEL 51పోస్టులకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>)కొద్వారా యూనిట్‌లో 51 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BE/B.Tech/BSc(Engg.), MBA/MCom అర్హతగల వారు నేటి నుంచి JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష జనవరి 25న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: bel-india.in