News January 16, 2025

జనవరి 16: చరిత్రలో ఈ రోజు

image

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి జననం
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం

Similar News

News September 10, 2025

ఖతర్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

image

ఖతర్ రాజధాని దోహాపై నిన్న ఇజ్రాయెల్ చేసిన <<17661181>>అటాక్‌ను<<>> PM మోదీ ఖండించారు. ‘ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్‌తో మాట్లాడాను. సోదర దేశమైన ఖతర్ సార్వభౌమాధికారంపై దాడిని భారత్ ఖండిస్తోంది. ఘర్షణలకు తావులేకుండా చర్చలు, దౌత్యపరంగా సమస్యల పరిష్కారానికి మద్దతిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖతర్‌లో శాంతి, స్థిరత్వానికి ఇండియా అండగా నిలబడుతుంది’ అని ట్వీట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.

News September 10, 2025

అలనాటి రోజులను గుర్తు చేసిన హీరోయిన్

image

90ల్లో టాప్ హీరోయిన్‌గా మీనా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు తగ్గించినా ఈ బ్యూటీ ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఆమె దిగిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. 48 ఏళ్లు వచ్చినా మీనా అందం ఏ మాత్రం తగ్గలేదని, ఆనాటి రోజులను గుర్తు చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం? కామెంట్.

News September 10, 2025

ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు: DGHS

image

ఫిజియోథెరపిస్టులు డాక్టర్స్ కాదని, వారి పేర్ల ముందు ‘Dr.’ అని పెట్టుకోవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(DGHS) ఆదేశించింది. ఒకవేళ ‘Dr.’ ట్యాగ్ వాడితే అది చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ‘ఇలా చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించినట్లే. మెడికల్ ప్రాక్టీస్‌పై అవగాహన లేనందున ఫిజియోథెరపిస్టులు ప్రాథమిక చికిత్స చేయకూడదు. వైద్యులు రిఫర్ చేసిన పేషెంట్లనే ట్రీట్ చేయాలి’ అని పేర్కొంది.