News January 17, 2025

జనవరి 17: చరిత్రలో ఈరోజు

image

1908: సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ జననం
1917: సినీ నటుడు, తమిళనాడు మాజీ సీఎం ఎం.జి.రామచంద్రన్ జననం
1942: బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ జననం
1945: తెలంగాణ కవి, రచయిత మడిపల్లి భద్రయ్య జయంతి
2010: బెంగాల్ మాజీ సీఎం జ్యోతిబసు మరణం
1989: దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి భారతీయుడు కల్నల్ జె.కె బజాజ్

Similar News

News November 7, 2025

అజిత్ సినిమాలో విజయ్ సేతుపతి, లారెన్స్!

image

హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌‍లో AK 64 మూవీతో బిజీగా ఉన్నారు. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు జనవరిలో ప్రకటిస్తామన్నారు. దీనిని పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, లారెన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారని చెబుతున్నారు. త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని సమాచారం.

News November 7, 2025

Paytm నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

image

పేటీఎం సంస్థ ‘చెక్-ఇన్’ పేరిట కొత్త AI ట్రావెల్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించింది. బస్, మెట్రో, ట్రైన్స్, ఫ్లైట్స్‌కు సంబంధించిన వంటి టికెట్స్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ మేనేజ్మెంట్, పర్సనల్ ట్రావెల్ ప్లాన్స్, డెస్టినేషన్ రికమెండేషన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత స్మార్ట్‌గా, సులభంగా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకోవచ్చని పేటీఎం ట్రావెల్ సీఈవో వికాస్ జలాన్ తెలిపారు.

News November 7, 2025

డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

image

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాక్‌తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్‌ను సమం చేశారు.