News January 18, 2025
జనవరి 18: చరిత్రలో ఈరోజు
1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం
1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం
1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం
1975: సినీ నటి మోనికా బేడి జననం
1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం
2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం
Similar News
News January 18, 2025
బీజేపీ మ్యానిఫెస్టోలోనూ మా పథకాలే: కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ పథకాలపై విమర్శలు చేస్తూనే BJP చీఫ్ నడ్డా ఉచితాలను ప్రకటించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఉచితాలు హానికరం కాదని చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ గతంలో తమపై చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకోవాలన్నారు. తాము అమలు చేస్తున్న పథకాలనే బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించిందని విమర్శించారు.
News January 18, 2025
ఆ రోజున కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చే అవకాశం: యోగీ
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు ఈ నెల 29 అమవాస్య రోజున 8-10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని UP సీఎం యోగీ ఆదిత్యనాథ్ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు, 24 గంటల విద్యుత్, నీటి సరఫరా, అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని తెలిపారు. అమవాస్య రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానానికి పోటెత్తుతారని పేర్కొన్నారు.
News January 18, 2025
ఈ ఏడాది గరిష్ఠంగానే భారత్ వృద్ధి రేటు: IMF
ఈ ఏడాదికిగానూ ప్రపంచదేశాల వృద్ధి రేటు అంచనాలతో ఐఎంఎఫ్ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది భారత వృద్ధి రేటు గరిష్ఠంగా 6.5గా ఉండగా ఈ ఏడాదీ అదే కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు అడ్వాన్స్డ్ ఎకానమీగా పేరొందిన USA వృద్ధి రేటు 2.7గా ఉండొచ్చని పేర్కొంది. మధ్య ఆదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4.2గా అల్ప ఆదాయ దేశాల్లో 4.6గా వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.