News January 25, 2025

జనవరి 25: చరిత్రలో ఈ రోజు

image

1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం

Similar News

News November 6, 2025

బోన్ సూప్ తాగుతున్నారా?

image

చాలామందికి చికెన్, మటన్ బోన్ సూప్ అంటే ఇష్టం. ఇది రుచికరమే కాకుండా ఆరోగ్యానికీ ఎంతో మంచిదని యూరోపియన్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ‘ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అమైనో ఆమ్లాలు, గ్లుటామైన్, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణశక్తి, గట్ హెల్త్‌, రోగనిరోధక శక్తికి దోహదం చేస్తాయి. చలికాలంలో వేధించే జలుబు, గొంతునొప్పి, దగ్గు, మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అవయవాల్లో వాపు సమస్యలను నివారిస్తాయి’ అని పేర్కొంది.

News November 6, 2025

గిగ్ వర్కర్ల సంక్షేమానికి TG ప్రత్యేక చట్టం

image

TG: రాష్ట్ర గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్-2025ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ బిల్లును త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో ఆమోదిస్తారు. అనంతరం రానున్న అసెంబ్లీ సమావేశంలో ఆమోదించి ప్రత్యేక చట్టం చేయనున్నారు. ఈ చట్టం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందిస్తుంది. ప్రధానంగా ఆదాయ భద్రత, కార్మికులకు సంక్షేమ నిధి ఏర్పాటు, గిగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు.

News November 6, 2025

నియోనాటల్‌ పీరియడ్‌ కీలకం

image

బిడ్డ పుట్టిన మొదటి 28 రోజులు చాలా క్లిష్టమైన సమయం. దీన్ని నియోనాటల్‌ పీరియడ్‌ అంటారు. ఈ సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా శిశువు ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. నియోనాటల్‌ పీరియడ్‌‌లో బిడ్డకు అనారోగ్యాల ముప్పు తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహించడానికి స్పెషల్‌ కేర్‌ అవసరం. బిడ్డను వెచ్చగా ఉంచడం, శ్వాసక్రియ సరిగా ఉండేలా చూడటం, తల్లిపాలు, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటం ముఖ్యమని చెబుతున్నారు.