News January 28, 2025
జనవరి 28: చరిత్రలో ఈ రోజు

1950: భారత సుప్రీంకోర్టు ఏర్పాటు
1865: జాతీయోద్యమ నాయకుడు లాలా లజపతిరాయ్ జననం
1885: భాషా పరిశోధకుడు గిడుగు వెంకట సీతాపతి జననం
1920: నిర్మాత, దర్శకుడు బి.విఠలాచార్య జననం
1986: హీరోయిన్ శ్రుతి హాసన్ జననం
2004: దర్శకుడు, క్రీడాకారుడు పామర్తి సుబ్బారావు మరణం
2014: దర్శకుడు, నట శిక్షకుడు బీరం మస్తాన్‌రావు మరణం
Similar News
News January 22, 2026
బంగారు, వెండి ఆభరణాలు పింక్ కలర్ పేపర్‌లో ఎందుకు?

పింక్ కలర్ బంగారాన్ని మరింత మెరిసేలా చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. అలాగే పలు సైంటిఫిక్ రీజన్సూ ఉన్నాయి. బంగారం, వెండి సెన్సిటివ్ మెటల్స్. గాలి, తేమ తగిలితే దీర్ఘకాలంలో సహజత్వాన్ని కోల్పోతాయి. ప్రింటెడ్ పేపర్లలో రసాయనాలు ఉండటంతో దీర్ఘకాలంలో ఆభరణాలకు డ్యామేజ్ జరుగుతుంది. దీన్నే ఆక్సిడేషన్ అంటారు. పింక్ పేపర్‌లో సల్ఫర్, యాసిడ్, బ్లీచ్ ఉండవు. దీనివల్ల ఆభరణాలకు ఎలాంటి కెమికల్ రియాక్షన్ ఉండదు.
News January 22, 2026
మూగజీవాలను చంపేవారిపై కఠిన చర్యలు: సీతక్క

TG: మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. పలు చోట్ల వీధికుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. సమస్యకు పరిష్కారం చట్టబద్ధంగా, శాస్త్రీయంగా జరగాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. RRలోని యాచారంలో 100 కుక్కలకు విషమిచ్చిన ఘటన వెలుగు చూడగా, కామారెడ్డిలో కోతులను చంపిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.
News January 22, 2026
టెన్త్, ఐటీఐతో 210 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


