News January 31, 2025

జనవరి 31: చరిత్రలో ఈ రోజు

image

1905: కవి, రచయిత కందుకూరి రామభద్రరావు జననం
1963: నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది
1972: మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ జననం
1974: సినీ నటి రక్ష జననం
1975: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా జననం
1997: టీమ్ ఇండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ జననం
2009: హాస్యనటుడు నగేష్ మరణం
నౌరు దేశ స్వాతంత్ర్యం దినోత్సవం

Similar News

News December 1, 2025

వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

image

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News December 1, 2025

₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

image

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.