News May 20, 2024

జనవరి- మార్చి త్రైమాసికం వృద్ధి రేటు 6.7%

image

గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో భారత వృద్ధి రేటు 6.7శాతంగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ అంచనా వేసింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9- 7 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. ఇటు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ 2023- 24లో వృద్ధి రేటు 7శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా ఈ నెల 31న 2023-24 ఆర్థిక సంవత్సర GDP అంచనాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

Similar News

News November 8, 2025

చరిత్ర సృష్టించిన ఉమెన్స్ వరల్డ్ కప్

image

ఇటీవల ముగిసిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ డిజిటల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో 446 మిలియన్ల మంది వీక్షించినట్లు సంస్థ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్‌లో ఇదే అత్యధికమని, 3 వరల్డ్ కప్‌ల టోటల్ వ్యూయర్‌షిప్ కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే భారత్-సౌతాఫ్రికా ఫైనల్‌ను 185 మిలియన్ల మంది చూశారని వివరించింది. ఇది 2024 మెన్స్ T20WC ఫైనల్‌తో సమానమని వెల్లడించింది.

News November 8, 2025

సినిమా అప్డేట్స్

image

* 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తుడరుమ్’ చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. ఇండియన్ పనోరమ విభాగంలో ఈ సినిమాలు ఎంపికయ్యాయి.
* కమెడియన్ సత్య హీరోగా ‘మత్తువదలరా’ ఫేమ్ రితేశ్ రాణా డైరెక్షన్‌లో మూవీ ప్రారంభమైంది.
* కమల్ హాసన్ హీరోగా ‘KHAA-హంట్ మోడ్ ఆన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ సినిమా రూపొందనుంది. స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బుమణి, అరివు మణి దర్శకత్వం వహిస్తారు.

News November 8, 2025

హిడ్మాను పట్టుకునేందుకు పక్కా ప్లాన్

image

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాను పట్టుకునేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న ఆ రాష్ట్ర సరిహద్దుల్లో 2 వేల మంది జవాన్లతో చుట్టుముట్టారు. డ్రోన్లతో నిఘా పెట్టారు. మ్యాపింగ్, థర్మల్ ఇమేజింగ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో అబూజ్‌మడ్ అడవులను జల్లెడ పడుతున్నారు. బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల్లో ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.