News April 2, 2024

భారతీయులకు జపాన్ ఈ-వీసాలు

image

భారతీయ పర్యాటకులకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది జపాన్ ప్రభుత్వం. భారతీయులు సహా భారత్‌లో నివసించే విదేశీయులకు ఈ-వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రక్రియ నిన్నటి నుంచి అమలైంది. VFX గ్లోబల్ నిర్వహించే అప్లికేషన్ సెంటర్ల దగ్గర దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో వీసా మంజూరు అవుతుందట. ఫోన్‌కు వచ్చే ‘వీసా ఇష్యూయెన్స్ నోటీసు’ను ఎయిర్‌పోర్టు సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది.

Similar News

News November 8, 2024

Review: నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’

image

కథ ఫర్వాలేదు అనుకున్నా, దర్శకుడు సుధీర్ వర్మ తెరపై ఆ స్థాయిలో చూపలేకపోయారు. ఫస్టాఫ్ బోరింగ్‌గా సాగితే సెకండాఫ్‌లో సస్పెన్స్ రివీల్‌లో తేడా కొట్టింది. పాత్రలనూ సరిగ్గా ప్లాన్ చేయలేదు. కొన్నిచోట్ల నవ్వుకోదగ్గ కామెడీ సీన్లుంటాయి. నిఖిల్ సహా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి.
రేటింగ్: 1.5/5

News November 8, 2024

తిరుమలను UTగా చేయాలన్న కేఏ పాల్ పిటిషన్ డిస్మిస్

image

AP: లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ అంశంలో రాజకీయం నడుస్తోందని, దేశ ప్రతిష్ఠను కాపాడటానికి పిల్ వేశానని పాల్ పేర్కొన్నారు. దీనిప్రకారం అన్ని ఆలయాలు, గురుద్వారాలను ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆదేశించామని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది.

News November 8, 2024

మంచి జీవితం కోసం కొన్ని గుడ్ హ్యాబిట్స్

image

పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా తరచూ జీవిత సూత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొన్నింటిని అలవాటు చేసుకోవాలని తాజాగా సూచించారు. > నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని 80/20 పద్ధతిలో తినండి. రోజూ వ్యాయామం చేయండి. పుస్తకాలు చదవండి. కృతజ్ఞతగా ఉండటాన్ని పాటించండి. మీ రోజును ప్లాన్ చేసుకోండి. లక్ష్యాలను సెట్ చేయండి. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి.