News January 29, 2025

‘అణు’ దాడి జరిగిన ప్రాంతాలకు రండి.. ట్రంప్‌కు జపాన్ ఆహ్వానం

image

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడి జరిగి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా అక్కడ పర్యటించాలని ఆ నగరాల మేయర్లు US అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ‘అణుశక్తిపై ఆధారపడటాన్ని తగ్గించి అణ్వాయుధ నిషేధానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాం. తద్వారా ప్రపంచశాంతిని నెలకొల్పుతారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌పై US అణుబాంబులు జారవిడవగా 2.10 లక్షలమందికిపైగా కన్నుమూశారు.

Similar News

News February 3, 2026

ఇంట్లో అదనపు దేవుడి విగ్రహాలు ఉంటే..?

image

ఇంట్లో అదనంగా ఉన్న దేవుడి విగ్రహాలు/ఫోటోలను పొరపాటున కూడా ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. దీనివల్ల దరిద్రం చుట్టుముట్టే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. వాటిని భద్రంగా చూసుకోగలిగే వ్యక్తులకు ఇవ్వాలని సూచిస్తున్నారు. లేకపోతే సమీపంలోని ఆలయాలకు అప్పగించాలని అంటున్నారు. అది కూడా కుదరకపోతే పారే నదిలో వాటిని నిమజ్జనం చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

News February 3, 2026

USతో అణు చర్చలకు సిద్ధమవుతున్న ఇరాన్

image

USతో అణు చర్చలకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ USతో చర్చలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఫార్స్ వార్తా సంస్థను ఉటంకిస్తూ AFP పేర్కొంది. ఏ తేదీన ఇవి జరుగుతాయో చెప్పలేదు. కాగా US ఇరాన్‌పై దాడిచేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీ నిన్న హెచ్చరించారు. దీనిపై స్పందిస్తూ ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొనడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

News February 3, 2026

98.42% రూ.2వేల నోట్లు వెనక్కి వచ్చాయి: RBI

image

రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై RBI కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 98.42 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని తెలిపింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్లు RBI 2023 మే-19న ప్రకటించింది. అప్పుడు ప్రజల వద్ద రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లుండగా.. ఈ జనవరి 31 నాటికి అవి రూ.5,609 కోట్లకు చేరుకున్నాయి. ప్రజల వద్ద రూ.2 వేల నోట్లుంటే RBI కార్యాలయాల్లో డిపాజిట్ లేదా మార్చుకోవచ్చని సూచించింది.