News May 14, 2024
తొలి 6G డివైజ్‌ను ఆవిష్కరించిన జపాన్

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్‌ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్‌తో పోలిస్తే ఈ డివైజ్(నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News March 24, 2026
సినీ పరిశ్రమ అభివృద్ధిపై CM CBNతో సంజయ్ దత్ భేటీ

AP: CM CBNతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, షూటింగ్‌లకు APని కేంద్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఉన్న అవకాశాలపై చర్చ జరిగింది. సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంజయ్ దత్ వివరించారు. ఫిలిం స్టూడియోలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ పరంగా ప్రణాళికలు ఉన్నాయని CM తెలిపారు.
News March 24, 2026
పీజీ మెడికల్ కౌన్సెలింగ్ గడువు పెంచలేం: SC

AP, TGల్లో మిగిలిన 623 PG మెడికల్ సీట్ల భర్తీపై PVT కాలేజీలకు SCలో చుక్కెదురైంది. దీనికి సంబంధించిన పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే ఏడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా గడువు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అకడమిక్ క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే దీనిపై కాలేజీలు కేంద్రాన్ని సంప్రదించొచ్చని సూచించింది. కేంద్రం మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.
News March 24, 2026
ఎన్నికల వేళ కమల్ హాసన్ సంచలన ప్రకటన

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. ఇది త్యాగం కాదని, తన డ్యూటీ అని ట్వీట్ చేశారు. అయితే డీఎంకే కూటమికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా ఎన్నికల్లో కమల్ పార్టీకి డీఎంకే రెండు స్థానాలు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే కమల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.


