News April 15, 2025

జపాన్‌లో రికార్డు స్థాయిలో తగ్గిన జనాభా!

image

జపాన్‌‌లో ‘యువశక్తి’ విషయంలో సంక్షోభం కొనసాగుతోంది. 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. మరోవైపు జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నా.. యువత వివిధ కారణాల వల్ల వివాహం, పిల్లల విషయంలో ఆలస్యం చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే జపాన్ అత్యల్ప బర్త్ రేట్‌ను నమోదు చేసింది.

Similar News

News April 16, 2025

రేపు ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్స్ ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. B.E, B.Techలో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థులు అన్సర్ కీతో పాటు ఫలితాలను రేపు తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో B.E, B.Tech ప్రవేశాల కోసం, ఏప్రిల్ 9న బీఆర్కే, బీప్లాన్ ఎంట్రన్స్ కోసం పరీక్షలు నిర్వహించారు.
వెబ్‌సైట్: <>jeemain.nta.nic.in<<>>

News April 16, 2025

కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట

image

మహారాష్ట్ర Dy.CM శిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్ కునాల్ కమ్రాను పోలీసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయొద్దని కోరుతూ బాంబే హైకోర్టును కమ్రా ఆశ్రయించగా కోర్టు తాత్కాలికంగా ఊరటనిచ్చింది. తీర్పును రిజర్వ్ చేశామని, అప్పటి వరకు కునాల్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసుల్ని ఆదేశించింది.

News April 16, 2025

మరోసారి నిరాశపరిచిన ‘మెక్‌గర్క్’

image

ఢిల్లీ బ్యాటర్ మెక్‌గర్క్ మరోసారి నిరాశపరిచారు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో రెండు ఫోర్లు కొట్టి ఊపు మీదున్నట్లు కనిపించినా 9 పరుగులకే ఔటయ్యారు. ఈ సీజన్‌లో 6 ఇన్నింగ్సుల్లో 55 పరుగులే చేశారు. ఇందులో అత్యధికం 38 రన్స్. గత ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసిన ఈ హిట్టర్ ఈ సారి తేలిపోతున్నారు. మరి తర్వాతి మ్యాచుల్లోనైనా ఫామ్ అందుకొని ఢిల్లీకి శుభారంభం అందిస్తారో లేదో వేచిచూడాలి.

error: Content is protected !!