News November 23, 2024
కపిల్ దేవ్ సరసన జస్ప్రీత్ బుమ్రా

టీమ్ ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో సేనా దేశాల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌గా బుమ్రా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 7 సార్లు ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (7) రికార్డును సమం చేశారు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు.
Similar News
News November 22, 2025
బ్లడ్ గ్రూప్ డైట్ గురించి తెలుసా?

కొన్నిరకాల ఆహార పదార్థాలలో ‘లెక్టిన్లు’ అనే ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బ్లడ్ గ్రూప్ యాంటి జెన్ను బట్టి రక్తంలో చేరి అనారోగ్యానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. A: పండ్లు, కూరగాయలు, టోఫు, బీన్స్, చిక్కుళ్లు, తృణధాన్యాలు ఎక్కువగా, టమాట, వంకాయ, గోధుమలు, జొన్న, పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి.
News November 22, 2025
బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం

B:మటన్, సముద్ర ఆహారం, వంకాయ, బీట్రూట్, పెరుగు, జున్ను, బాదం, ద్రాక్ష, బీన్స్ ఎక్కువగా, చికెన్, జొన్న, గోధుమ, టమాటా, పల్లీలు, నువ్వులు, చిక్కుళ్లు, సోయా తక్కువగా తీసుకోవాలి. AB: కెఫిన్, ఆల్కహాల్, వేపుళ్లు తక్కువగా, పాల ఉత్పత్తులు, టోఫు, సముద్ర ఆహారంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. O: వీరు అధిక ప్రొటీన్ తీసుకోవాలి. గోధుమ పిండి, బీన్స్, సోయాబీన్ నూనెతో చేసిన ఆహారాలను తక్కువగా తీసుకోవాలి.
News November 22, 2025
132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్

యాషెస్: తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ 5 వికెట్లతో సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 2 పరుగులకే ఓపెనర్ క్రాలే వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్టోక్స్ సేన 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్సులో ENG 172 రన్స్‌కు ఆలౌటైన సంగతి తెలిసిందే.


