News August 8, 2024

జాతిరత్నాలు దర్శకుడితో విశ్వక్ సేన్ మూవీ

image

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ సినిమాల జోరు పెంచారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో కొత్త సినిమాను అధికారంగా ప్రకటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై VS14ను నిర్మించినట్లు పేర్కొన్నారు. విశ్వక్ ఇప్పటికే మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తుండగా ఇటీవలే VS13ను ప్రకటించారు. మరోవైపు వినోదాత్మక చిత్రాల తీసే అనుదీప్ మూవీలో విశ్వక్ నటించనుండటంతో వీరిద్దరి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Similar News

News November 21, 2025

ఖమ్మం: మధ్యాహ్న భోజన వ్యయం పెంపు

image

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుకింగ్‌ కాస్ట్‌’ను పెంచుతూ పాఠశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దీని ప్రకారం, ప్రాథమిక స్థాయి విద్యార్థికి ఖర్చు రూ.6.19 నుంచి రూ.6.78కి, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థికి రూ.11.79 నుంచి రూ.13.17కు పెరిగింది. హెచ్‌ఎంలు వెంటనే బిల్లులు పంపాలని ఆదేశించారు.

News November 21, 2025

సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనుగోలు చేయొచ్చు

image

AP: శ్రీసత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన బాబా స్మారక రూ.100 నాణేలను సొంతం చేసుకునేందుకు భక్తులు ఆసక్తిచూపుతున్నారు. https://www.indiagovtmint.inలో మాత్రమే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280. నాణెంతోపాటు ఆయన జీవిత విశేషాల బుక్‌లెట్ కూడా అందుతుంది. ఆన్‌లైన్ పేమెంట్‌తో బుక్ చేసుకున్న నెల రోజుల్లోపు వీటిని ఇంటికి పంపుతారు.

News November 21, 2025

మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

image

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్‌ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.