News April 13, 2025
జావెలిన్ త్రోయర్‌పై నాలుగేళ్ల నిషేధం

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.
Similar News
News January 27, 2026
డీసీసీబీల్లోనూ యూపీఐ సేవలు

AP: రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల్లో త్వరలోనే UPI సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో నిన్న ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ బ్యాంకుల్లో ఎక్కువగా ఖాతాలు కలిగిన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కాగా ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల్లోనే ఈ సేవలు ఉన్న విషయం తెలిసిందే.
News January 27, 2026
మంత్రులతో భేటీకి కారణమిదే: భట్టి

TG: మున్సిపల్ ఎన్నికల్లో GPల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్‌లో భేటీలో మంత్రులు పరిపాలన, ఎన్నికలకు సంబంధించి మాట్లాడారని చెప్పారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎం, మంత్రులందరం సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. సింగరేణిలో అవినీతి జరగలేదని, ఏమైనా అనుమానాలు ఉంటే లేఖ రాస్తే విచారణ చేయిస్తామని తెలిపారు.
News January 27, 2026
మంచుదుప్పటి నడుమ గుడి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో!

అమెరికాలో భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ డల్లాస్‌లోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మెరిసిపోతోంది. ఈ అద్భుత దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ మంచుతో ఉన్న ఆలయం ఫొటోలు ప్రస్తుతం SMలో వైరలవుతున్నాయి.


