News May 26, 2024
జవహర్ ‘చీప్ సెక్రటరీ’: సోమిరెడ్డి

AP: వ్యవసాయం, ఇరిగేషన్, విద్య తదితర కీలక శాఖలకు కేటాయించిన నిధులను మళ్లించే అధికారం CS జవహర్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ఏ CS కూడా ఇలా దిగజారలేదని చెప్పారు. జగన్ దోచుకుంటున్న రూ.లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంటుగా ఆయన మారిపోవడం దురదృష్టకరమన్నారు. జవహర్ చీఫ్ సెక్రటరీ కాదు చీప్ సెక్రటరీ అని Xలో మండిపడ్డారు.
Similar News
News November 17, 2025
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. ఈనెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
News November 17, 2025
ఢిల్లీ పేలుడు: ఏమిటీ డెడ్ డ్రాప్?

ఢిల్లీ పేలుడు కేసు నిందితులు ‘డెడ్ డ్రాప్’ ఈ-మెయిల్ విధానం వాడినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఒకే మెయిల్ IDతో రహస్యంగా సమాచార మార్పిడి చేసుకోవడమే ‘డెడ్-డ్రాప్’ పద్ధతి. సమాచారాన్ని డ్రాఫ్ట్లో సేవ్ చేస్తే, దాన్ని అవతలి వ్యక్తి చూస్తారు. తర్వాత అప్డేట్ లేదా డిలీట్ చేస్తారు. ఇందులో మెయిల్ పంపడం, రిసీవ్ చేసుకోవడమనేదే ఉండదు. దీన్ని గుర్తించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.
News November 17, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం.
*కాంగ్రెస్, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాలని AICC కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కొన్ని కలుపు, గంజాయి మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని చెప్పారు.
* యాదగిరి గుట్టకు లక్షమందికి పైగా భక్తుల రాక. ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు అధికారుల వెల్లడి.


