News January 31, 2025
జయలలిత ఆస్తి రూ.4వేల కోట్లు.. అంతా TN ప్రభుత్వానికే

దివంగత సీఎం జయలలిత ఆస్తిని ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు స్పెషల్ కోర్టు ఆదేశించింది. దీంతో కర్ణాటక పరిధిలో ఉన్న 1,562 ఎకరాల భూమి, 27 కేజీల బంగారం, 10వేల చీరలు, 750 జతల చెప్పులు, వాచ్లను అధికారులు అప్పగించనున్నారు. పదేళ్ల కిందట ఈ ఆస్తుల విలువ రూ.913 కోట్లు కాగా, ఇప్పటి మార్కెట్ విలువ రూ.4వేల కోట్లపైనే అని అంచనా.
Similar News
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<
News December 4, 2025
‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.


