News March 20, 2024

జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: CBN

image

ఏపీలో ఎన్డీయే కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలపడంపై చంద్రబాబు స్పందించారు. ‘టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నట్లు జయప్రకాశ్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. రాష్ట్రంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు, ప్రతి సంస్థ ముందుకు రావాలి’ అని Xలో పిలుపునిచ్చారు.

Similar News

News November 25, 2024

సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: మంత్రి పొన్నం

image

TG: బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలిపి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డేటా సంక్షేమ పథకాల లబ్ధి, బీసీల అభివృద్ధికి చొరవ చూపిస్తుందన్నారు. ఒకవేళ ఎన్యుమరేటర్లు రాకపోతే పిలిపించుకొని సర్వే నిర్వహించుకోవాలని సూచించారు.

News November 25, 2024

జేఈఈ మెయిన్స్-1 దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్

image

జేఈఈ మెయిన్స్-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగియగా, తప్పుల సవరణకు ఎన్టీఏ అవకాశమిచ్చింది. రేపు, ఎల్లుండి వెబ్‌సైట్‌లో ఎడిట్ ఆప్షన్ ద్వారా తప్పులు సవరించుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థి పేరు, DOB, తల్లిదండ్రుల పేర్లలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. మొబైల్ నంబర్, ఈమెయిల్, ఫొటో, అడ్రస్ మార్చుకునేందుకు అవకాశం లేదు.

News November 25, 2024

తొలి రోజు అన్‌సోల్డ్ ప్లేయర్లు వీరే..

image

తొలి రోజు IPL మెగా వేలంలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, వాకర్ సలామ్ కీల్, పియూష్ చావ్లా, కార్తీక్ త్యాగి, యశ్ దుల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, లవ్నీత్ సిసోడియా, ఉపేంద్ర సింగ్ యాదవ్, శ్రేయస్ గోపాల్ అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు. అత్యధికంగా పంజాబ్(PBKS) 10 మంది ప్లేయర్లను వేలంలో దక్కించుకోగా అత్యల్పంగా ముంబై ఇండియన్స్ నలుగురిని కొనుగోలు చేసింది.