News December 30, 2024
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
AP: రేషన్ బియ్యం మిస్సింగ్ ఆరోపణల కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. జయసుధ పేరిట ఉన్న గౌడౌన్‌ను అద్దెకు ఇవ్వగా అక్కడున్న రేషన్ బియ్యం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి.
Similar News
News January 2, 2025
నితీశ్ వస్తే కలిసి పనిచేస్తాం: లాలూ ప్రసాద్
బిహార్ CM నితీశ్ తిరిగి INDIA కూటమిలో చేరికపై RJD Chief లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. నితీశ్ తిరిగి కూటమిలోకి వస్తే కలిసి నడుస్తామని లాలూ పేర్కొన్నారు. దీంతో నితీశ్ కూటమి మారుతారన్న ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ వ్యాఖ్యల్ని JDU నేతలు కొట్టిపారేశారు. దీనిపై నితీశ్‌ను ప్రశ్నించగా ‘ఏం మాట్లాడుతున్నావ్’ అంటూ వ్యాఖ్యానించారు. తాము NDAలోనే ఉంటామని మరో నేత లల్లన్ స్పష్టం చేశారు.
News January 2, 2025
రోహిత్ పోరాడాల్సిన సమయం ఇది: పఠాన్
BGT చివరి టెస్టుకు రోహిత్ శర్మ దూరమవుతారని వస్తోన్న వార్తలపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఈ దశలో పోరాడాలి. అతను బయటకు రావాలని కోరుకోవట్లేదు. భారత క్రికెట్‌కు రోహిత్ ఎంతో చేశారు. ఈ పరిస్థితులను తిప్పికొట్టే సామర్థ్యం ఆయనకు ఉంది. ఇది సిరీస్‌లో కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సిరీస్ తర్వాతే బయటకు రావాలి’ అని ఆయన సూచించారు.
News January 2, 2025
జ్యోతి యర్రాజీ నేపథ్యమిదే..
పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన జ్యోతి యర్రాజీకి కేంద్రం <<15045760>>అర్జున<<>> అవార్డు ప్రకటించింది. వైజాగ్‌కు చెందిన ఈ పరుగుల రాణి 1999 ఆగస్ట్ 28న జన్మించారు. స్థానికంగానే విద్యాభ్యాసం చేశారు. 25 ఏళ్లకే అనేక జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు. 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు(12.78 సెకన్లు) ఇంకా ఆమె పేరిటే ఉంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో రజతం, WUGలో కాంస్యం సాధించారు.