News June 27, 2024
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా

శ్రీలంక జాతీయ జట్టుతో పాటు అండర్-19, శ్రీలంక-ఏ జట్ల కన్సల్టెంట్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే రిజైన్ చేశారు. కారణాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. టీ20 WCలో శ్రీలంక పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆయన ఆ పదవిలో ఉన్నారు. వరల్డ్ కప్లో శ్రీలంక లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
వింత ఆచారం.. అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలు

తెలంగాణ వినూత్న ఆచారాలకు నిలయం. ఇక్కడ ప్రాంతాలను బట్టి ఆచారాలు, ఆహారపు అలవాట్లూ మారుతుంటాయి. అలాంటి ఓ ఆచారం ప్రకారం పెళ్లిలో అక్షింతలుగా బియ్యానికి బదులు జొన్నలను వాడటం కొన్నిచోట్ల కనిపిస్తుంది. జొన్నలను కొన్ని వర్గాల ప్రజలు బియ్యం కంటే పవిత్రంగా భావించి అక్షింతలుగా వాడతారట. ఆదిలాబాద్, వికారాబాద్, వెస్ట్ రంగారెడ్డి ప్రాంతాల్లోని పలు చోట్ల ఇది కనిపిస్తుంది. మీ ప్రాంతంలో ఈ ఆచారం ఉందా?COMMENT
News November 28, 2025
భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 28, 2025
స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.


