News January 23, 2026

JC vs పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హై అలర్ట్

image

AP: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. JC ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి పరస్పరం సవాల్ విసురుకున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరి ఇళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు కేతిరెడ్డి సవాల్ విసరగా.. సిద్ధమంటూ ఆయన ఇంటి ముట్టడికి JC వర్గీయులు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ TDP కౌన్సిలర్లు పెద్దారెడ్డిపై PSలో ఫిర్యాదు చేశారు.

Similar News

News February 17, 2026

హీరో తండ్రి కన్నుమూత

image

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్‌గా పని చేశారు.

News February 17, 2026

AI వల్ల ఉద్యోగాలు పోవు.. స్కిల్స్ పెంచుకోవడమే మార్గం: మోదీ

image

AI వల్ల ఉద్యోగాలు పోవని, మార్పులకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడమే మార్గమని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఆధునిక సాంకేతికత మనుషులను తొలగించబోదని, సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్తరకం ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అందుకే ప్రభుత్వం రీ-స్కిల్లింగ్‌పై భారీగా పెట్టుబడి పెడుతోందని చెప్పారు. గ్లోబల్ AI ఇండెక్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉండటం మన సత్తాకు నిదర్శనమన్నారు.

News February 17, 2026

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

image

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.