News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు.. నలుగురు రాజీనామా

వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపినందుకు నిరసనగా నలుగురు నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటేయడంతో తాము మనస్తాపానికి గురయ్యామని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్కు లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో తబ్రేజ్ సిద్ధిఖీ, మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ ఖాసిమ్ అన్సారీ, రాజు నయ్యర్ ఉన్నారు.
Similar News
News April 10, 2025
గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు

AP: గ్రామ, వార్డు సచివాలయాలను A, B, C కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు, 2501-3500 జనాభా ఉన్న సచివాలయానికి ముగ్గురు, 3501కి పైగా జనాభా ఉన్న సచివాలయానికి నలుగురు సిబ్బందిని కేటాయించింది. రియల్ టైమ్లో పౌరసేవలు అందించేలా సిబ్బందికి విధులు అప్పగించింది.
News April 10, 2025
ALERT: పరీక్ష తేదీ మార్పు

AP: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించనున్న పరీక్ష తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆరోజు ఈస్టర్ పర్వదినం కావడంతో పరీక్షను మరుసటి రోజు 21కి మార్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని విద్యాశాఖ సూచించింది. www.cse.ap.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది.
News April 10, 2025
‘మాస్ జాతర’ ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ 14న రిలీజ్ కానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తోండగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీతో వింటేజ్ రవితేజను చూపిస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.