News June 6, 2024

అగ్నిపథ్ స్కీమ్‌ను వెనక్కి తీసుకోవాలన్న JDU!

image

NDA కూటమిలో ఉన్న JDU కీలక డిమాండ్‌ను బీజేపీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్/అగ్నివీర్ స్కీమ్‌ అమలును పున: సమీక్షించాలని కోరినట్లు సమాచారం. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి ఈ నిర్ణయం ఓ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక(ONOP), యూనిఫాం సివిల్ కోడ్(UCC)ను సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సూచనపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Similar News

News December 12, 2025

శనగలో ఎండు, వేరుకుళ్లు తెగుళ్ల నివారణ ఎలా?

image

ప్రస్తుతం రబీ శనగ పంట కొన్ని ప్రాంతాల్లో శాఖీయ దశలో ఉంది. ఈ సమయంలో భూమి నుంచి వచ్చే తెగుళ్ల ముప్పు ఎక్కువ. ముఖ్యంగా ఎండు, వేరుకుళ్లు తెగుళ్లు ఆశించి మొక్కలు పసుపు రంగులోకి మారి అక్కడక్కడ గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ప్రొపినెబ్ 400 గ్రా. లేదా కుప్రోఫిక్స్ 400 గ్రా. లేదా టెబుకోనజోల్ 200mlలలో ఏదో ఒక మందును కలిపి మొక్కల వేర్లు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.

News December 12, 2025

కోల్డ్ వాటర్ థెరపీతో ఎన్నో లాభాలు

image

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ, జీవక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్, ఫైటింగ్ కెమికల్స్ విడుదలవుతాయి. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల డోపమైన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ‘ఫీల్ గుడ్’ హార్మోన్. ఇది తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు.

News December 12, 2025

నేడు మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

image

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాతలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. క్వింటాకు రూ.2,400 చొప్పున అందజేయనుంది. కాగా కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని తామే పంటను సేకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.