News January 22, 2025
జేడీయూ U టర్న్.. బీజేపీతోనే ఉన్నామని ప్రకటన

మణిపుర్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వచ్చిన వార్తలపై జేడీయూ స్పందించింది. సెంట్రల్ లీడర్షిప్కు తెలియకుండానే లోకల్ చీఫ్ క్షేత్రిమయుమ్ బిరేన్ సొంతంగా గవర్నర్కు లేఖరాశారని వివరణ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యం కింద వెంటనే అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. తాము బీజేపీకే మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
Similar News
News December 23, 2025
మెస్సీ సోదరికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీ సోదరి మారియా సోల్ మియామిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె శరీరంలో కొంతభాగం కాలిపోవడంతో పాటు వెన్నెముక, మడమ, మణికట్టు వద్ద ఫ్రాక్చర్ అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 3న జరగాల్సిన ఆమె పెళ్లి కూడా వాయిదా పడింది. మెస్సీ ఇటీవల భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
News December 23, 2025
డిస్కౌంట్లో చేనేత వస్త్రాల అమ్మకాలు: సవిత

AP: ఈనెల 26నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి సవిత తెలిపారు. ’60, 50, 40 శాతాల్లో చేనేత వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయి. గుంటూరు, మంగళగిరిలోని యర్రబాలెంలో 60% డిస్కౌంట్తో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. VJAలోని ఆప్కో మెగా షో రూమ్లో 50%, మిగిలిన అన్ని షో రూముల్లో 40% డిస్కౌంట్లు ఉన్నాయి. 2 రోజుల్లోగా సహకారసంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి’ అని తెలిపారు.
News December 23, 2025
భాకరాపురంలో జగన్ ప్రజాదర్బార్

AP: వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.


