News November 1, 2025

JEE మెయిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

image

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్-2026 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. <>jeemain.nta.ac.in<<>> వెబ్‌సైట్‌లో ఈ నెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. JEE మెయిన్ రెండు సెషన్లలో జరగనుంది. ఫస్ట్ సెషన్ జనవరి 21, 30 తేదీల మధ్య, రెండో సెషన్ ఏప్రిల్ 1, 10 తేదీల మధ్య నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. బీఈ, బీటెక్, B. Arch, B. Planning కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Similar News

News November 1, 2025

విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు!

image

TG: ST, BC, మైనార్టీ, EBC విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలు ఉండటంతో కొన్ని కాలేజీలు వారి నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అందిస్తున్న SC విద్యార్థుల తరహాలో మిగతా వారికీ అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఏటా 12.5 లక్షల మంది స్టూడెంట్స్‌కు సర్కార్ రూ.2,600Cr వెచ్చిస్తోంది.

News November 1, 2025

ఉప్పు వేయడం, వేర్లు నరకడం వల్ల కొబ్బరి దిగుబడి పెరుగుతుందా?

image

చాలా చోట్ల కొబ్బరి సాగు చేస్తున్న రైతులు చెట్లకు ఉప్పు వేయడం, వేర్లు నరకడం చేస్తుంటారు. దీని వల్ల దిగుబడి పెరుగుతుందని కొందరు చెబుతుంటారు. ఏడాది వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏడాది దిగుబడి కొంత పెరగడం కనిపిస్తుంది. కానీ తర్వాత ఏడాది నుంచి దిగుబడి తగ్గిపోతుంది. అది చెట్టుకు కూడా హాని చేస్తుంది. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అని, దీన్ని పాటించకపోవడం మంచిదని ఉద్యాన పరిశోధనా నిపుణులు చెబుతున్నారు.

News November 1, 2025

నేటి నుంచి చెస్ వరల్డ్ కప్

image

గోవా వేదికగా నేటి నుంచి ఈనెల 27 వరకు FIDE చెస్ వరల్డ్ కప్ జరగనుంది. వివిధ దేశాల నుంచి మొత్తం 206 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. చివరగా 2002లో భారత్ WCని హోస్ట్ చేసినప్పుడు విశ్వనాథన్ ఆనంద్ ఛాంపియన్‌గా నిలిచారు. ఆయనను గౌరవిస్తూ ఈ ఏడాది WCకి ఆనంద్ ట్రోఫీ అని పేరు పెట్టారు. IND నుంచి ప్రజ్ఞానంద, అర్జున్, గుకేశ్ తదితర ప్లేయర్లు పాల్గొననుండగా, కార్ల్‌సన్, కరువానా, నకమురా ఈ టోర్నీలో పాల్గొనట్లేదు.